మహేష్ మల్టీప్లెక్స్‌..ప్రారంభించిన సూపర్ స్టార్

230
- Advertisement -

ప్రిన్స్‌ మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్‌ను ప్రారంభించారు సూపర్ స్టార్ కృష్ణ. గచ్చిబౌలిలో ఏషియన్ ఫిలింస్ సంస్థతో మహేష్ నిర్మించిన ఈ మల్టీఫ్లెక్స్ కు ఏయంబీ(ఏషియన్ మహేష్ బాబు) సినిమాస్‌ అనే పేరును పెట్టగా ఆదివారం హీరో కృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో మహేష్‌తో పాటు నమ్రతా,ఏషియన్‌ ఫిలీంస్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

amb cinemas

అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభమైన ఈ థియేటర్ అందరిని ఆకట్టుకుంటోంది. మహేష్‌ మల్టీప్లెక్స్‌ని చూసేందుకు ఆయన ఫ్యాన్స్‌, ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ థియేటర్ సకల సౌకర్యాలతో స్వర్గలోకాన్ని భూలోకానికి దించినట్టే కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేషా మజాకానా? అన్న పేరుకు తగ్గట్టే అల్ట్రా రిచ్ లుక్ తో అదరగొడుతుంది.

mahesh multiplex

మహేష్- నమ్రత అభిరుచి ఎంత అల్ట్రా రిచ్ గా ఉంటుందో ఏఎంబి సినిమాస్ లుక్ చెబుతోంది. మల్టీప్లెక్స్ ప్రాంగణమంతా అరుదైన డిజైనింగ్ తో ఆకట్టుకుంటోంది. ఒకే సారి 1,638 మంది ఈ మల్టీప్లెక్స్‌లో సినిమాని చూడవచ్చు.

mahesh multiplex

- Advertisement -