ఛత్రపతి రీమేక్‌..హీరోగా బెల్లంకొండ!

164
bellamkonda
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘ఛత్రపతి’. 2005 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

అయితే తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ తెరకెక్కనుండగా ప్రభాస్ స్ధానంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ పవర్‌ఫుల్ సినిమాతో తెలుగు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి జయంతిలాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మాతృకకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించనుండగా ఇద్దరికి బాలీవుడ్‌లో ఇదే తొలిమూవీ కావడం విశేషం.

- Advertisement -