మంచు విష్ణుకు జోడిని వెతుకుతున్న శ్రీను వైట్ల!

135
manchu vishnu
- Advertisement -

మంచు విష్ణు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ఢీ. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. విష్ణు- బ్రహ్మానందం కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలవగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ డీ అంటే డీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. మ‌హ‌తి సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

ఢీసినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటించగా ఈ సీక్వెల్ కోసం పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అను ఇమాన్యుయల్‌, ప్రగ్యా జేస్వాల్,జాగా ‘అ ఆ’ సినిమాలో నితిన్ చెల్లెలి పాత్ర చేసిన హీరోషిని కోమాలి అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీరిలో ఎవరిని హీరోయిన్‌గా ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది.

- Advertisement -