RX 100 ద‌ర్శ‌కుడితో బెల్లంకొండ శ్రీనివాస్ ..

299
bellamkonda ajay bhupathi
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. హిట్ , ప్లాప్ లు ప‌ట్టించుకోకుండా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. జ‌య జాన‌కి నాయ‌క సినిమా త‌ర్వాత ఆయ‌న స‌రైన హిట్ ప‌డ‌లేదు. ఆయ‌న మొద‌టి నుంచి మాస్ ఆడియ‌న్స్ కి నచ్చే క‌థ‌లను ఎంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో ‘సీత సినిమా చేస్తున్నాడు. ఈచిత్రంలో కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమా తరువాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు తెలిపాడు.

rx100

తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆర్ఎక్స్ 100 మూవీ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇటివ‌లే అజ‌య్ భూప‌తి సాయి శ్రీనివాస్ కు క‌థ వినిపించ‌డాట‌..స్టోరీ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల టాక్.

అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా భారీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈసినిమా యూత్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అజయ్ భూపతితో కలిసి పనిచేయడానికి యువ హీరోలంతా ఎంతో ఉత్సాహాన్ని చూపుతున్నారు. త్వ‌ర‌లోనే ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియ‌నున్నాయి.

- Advertisement -