బెల్లంకొండ శ్రీనివాస్…సాక్ష్యం

194
Bellamkonda Sai Sreenivas SAAKSHYAM
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ తెరకెక్కిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాక్ష్యం” చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ నేటితో ముగిసింది. హోస్ పేట్ లో 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో 15 రోజులపాటు వరుసబెట్టి చిత్రీకరించిన ఈ షెడ్యూల్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తోపాటు హీరోయిన్ పూజా హెగ్డే మరియు ఇతర కీలకపాత్రధారులు పాల్గొన్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫిలిమ్ ను నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. “కర్ణాటకలోని హోస్ పేట్ లో మైన్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ను పిక్చరైజ్ చేశాం. ఈ షెడ్యూల్ తో 70% చిత్రీకరణ పూర్తయినట్లే. తెలుగు సినిమా చరిత్రలో “సాక్ష్యం”లోని యాక్షన్ ఎపిసోడ్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఎక్కడా డూప్ వాడకుండా చాలా కష్టపడి చేశాడు” అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్

- Advertisement -