ఆగస్టు 13న బెల్లంకొండ స్వాతిముత్యం..!

341
swathi muthyam
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు హీరోగా పరిచయమవుతున్న మూవీ స్వాతిముత్యం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా బెల్లంకొండ గణేష్‌ హీరోగా లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ప్రస్తుతం షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుండగా తాజాగా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుండగా సినిమా నుండి ఓ కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఓ స్కూటీపై హీరో బెల్లంకొండ గణేష్, హీరోయిన్ వర్షా బొల్లమ్మ ఇద్దరు జాలీగా వెళ్తూ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా ఈ చిత్ర టైటిల్ నిలవబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ ‘స్వాతిముత్యం’ ప్రేక్షకులను ఊ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -