ఒక్క ఫోటో.. మహిళను దొంగను చేసింది..

322
Beggar Woman Get Trouble with Diaper Baby in Jodhpur
- Advertisement -

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏది వాస్తవమో…? ఏది నిజమో..? తెలియలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు ఆకతాయిలు, కొందరు తొందరపాటు వలన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వలన అది వైరల్ గా మారి కొందరి ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా ఓ వ్యక్తి తొందర పాటు వలన ఓ మహిళ పిల్లలను ఎత్తుకుపోయే మహిళగా ప్రచారం జరిగింది

Beggar Woman Get Trouble with Diaper Baby in Jodhpur

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ జోధ్ పూర్ లోని శనీశ్వరుడి గుడి బయట ఓ మహిళ బిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమె పక్కింట్లో ఉంటూ చెత్త ఎరుకుని జీవిస్తున్న మరో మహిళ తన పాపను గుడి దగ్గర ఉన్న ఈ మహిళకు ఇచ్చి.. ఆమె బయటికి వెళ్లింది. ఇంతలో ఆ గుడికి వచ్చిన ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పాప అందంగా ఉండడం, డైపర్ వేసి ఉండడంతో ఆ మహిళను పిల్లలను ఎత్తుకుని పోయే మహిళగా కథనం రాసి పెద్ద ఎత్తున్న ప్రచారం చేశారు.

ఈ ఘటనపై ఎన్నారై మహిళ రోహిణి షా పోలీసులకు ఈ కథనాన్ని ట్యాగ్ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ సదరు మహిళ పిల్లలను ఎత్తుకుపోయే మహిళ కాదని, ఆ ఇద్దరు మహిళలు స్నేహితులని తేలింది. ఇలాంటి అసత్య కథనాలు ప్రచారం చేసి, అమాయకుల ప్రాణాల మీదకు తీసురావద్దని పోలీసులు సూచించారు. పోలీసులు అప్రమత్తమవ్వడంతో అసత్య ప్రచారంగా తేలిందని, లేకుంటే ఆ మహిళ పరిస్థితి ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చొరవ తీసుకుని సునితంగా సమస్యను పరిష్కరించిన పోలీసులను జోధ్‌పూర్‌ డీసీపీ అమన్‌ సింగ్‌ అభిందనందించారు.

 

- Advertisement -