ఎండ వేడిమి…చల్లటి బీరుతో చిల్!

126
beers
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అప్పుడే మండుతున్నాయి. బ‌య‌ట గంట సేపు కంటే ఎక్కువ న‌డిస్తే చాలు శరీరం త్వరగా అలసిపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చల్లటి బీరుతో సేద తీరుతున్నారు మద్యం ప్రియులు.

ఈ నెలలో ఎండల తీవ్రత మరింత పెర‌గ‌డంతో మందు బాటిల్‌ పక్కన పెట్టి….. బీరు సీసా ఎత్తు‌తు‌న్నారు. రాష్ట్ర‌వ్యా‌ప్తంగా గత పది‌రో‌జుల్లో బీర్ల అమ్మ‌కాలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్‌ 1 నుంచి 10 వరకు బీర్ల అమ్మ‌కాలు 20% పెరి‌గాయి.

కేవలం పది రోజు‌ల్లోనే పది లక్షల కేసుల బీర్లు అమ్ము‌డ‌య్యాయి. గతేడాది 8.3 లక్షల కేసుల బీర్లు అమ్ముడుకాగా ఇతర రకాల మద్యం అమ్మ‌కాల్లో స్వల్పంగా తగ్గు‌దల నమో‌దైంది. 2021 ఏప్రిల్‌ మొదటి పది‌రో‌జుల్లో 6 లక్షల కేసులుగా ఉన్న మద్యం అమ్మ‌కాలు ఈ ఏడాది 13% తగ్గి 5.14 లక్షల కేసు‌లుగా నమో‌దై‌నట్టు అధి‌కా‌రులు తెలి‌పారు.

- Advertisement -