బీర్‌ కొడితే..కిక్కుతో పాటు..అది కూడా..

214
Beer Can Actually Boost Creativity
- Advertisement -

హాట్ హాట్‌గా ఉన్న వాతావ‌ర‌ణంలో ఒక చ‌ల్ల‌ని బీర్ కొడితే ఎలా ఉంటుంది? ఆ మ‌జాయే వేరు క‌దా..! అవును మ‌రి.. మ‌జాగానే ఉంటుంది. కానీ.. దాని టేస్ట్ తెలిసిన వారికే ఆ మ‌జా తెలుస్తుంది. అయితే ఆ మజాకి ఇప్పుడు కాస్త సృజనాత్మకత కూడా తోడవుతోంది. అవును.. చిన్న పిట్ బీర్ తాగితే సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయట. ఆల్కహాల్ మోతాదు ఓ మాదిరిగా ఉండేలా కొద్ది మోతాదులో బీర్ తాగితే క్రియేటివ్ ఆలోచనలు పెరుగుతాయని యూనివర్సిటీ ఆఫ్ గ్రాజ్ అధ్యయనంలో వెల్లడైంది. లైట్‌గా బీరేసిన వాళ్లు మిగతా వారితో పోలిస్తే క్రియేటివ్ టాస్కుల్లో మెరుగ్గా రాణిస్తున్నారని ఆస్ట్రియాకు చెందిన సదరు యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

Beer Can Actually Boost Creativity

మగాళ్లయితే ఓ పింట్ బీరు (దాదాపు 500 ఎంఎల్), ఆడవాళ్లయితే 350 ఎంఎల్ బీర్ తాగితే వారి స్కోరు సుమారు 40 శాతం పెరిగిందని వన్ వర్డ్ అసోసియేషన్ టెస్ట్ తెలిపింది. క్రియేటివ్‌గా ఆలోచించడంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించడంలో ఆల్కహాల్ తోడ్పడుతోందని పరిశోధకులు తెలిపారు. సృజనాత్మకంగా ఓకే కానీ.. ఎగ్జిక్యూటివ్ విధుల విషయానికి వస్తే మాత్రం ఆల్కహాల్ నెగెటివ్ ప్రభావం చూపుతోందని తేలింది. సో..కాస్త డ్రింకింగ్‌ అలవాటు ఉన్నవాళ్ళు జర భద్రం సుమీ..!

- Advertisement -