పార్కింగ్‌ పాలసీపై కేటీఆర్ సమీక్ష

192
Telangana parking policy on the anvil
- Advertisement -

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ర్టంలోని ఇతర కార్పోరేషన్లలో పార్కింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన పార్కింగ్ పాలసీపైన మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. ఈ రోజు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జియచ్ యంసి అధికారులు, మెట్రోరైలు యండి, నగర పోలీస్ కమీషనర్లు ఈ సమావేశంలో పాల్గోన్నారు. పలుమార్లు వివిధ శాఖల భాగసామ్యంతో ఈ పాలసీని తయారు చేసినట్టు మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ పాలసీ స్థూలంగా తెలంగాణలోని అన్ని కార్పోరేషన్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు మంత్రి తెలిపారు.

ప్రస్తుతం రోజుకు సూమారు 700 నూతన వాహనాలు హైదరాబాద్ రోడ్లకి వస్తున్నాయని, ఇంత వేగంగా రోడ్లపై వస్తున్న వాహనాలతో ఎదురయ్యే పార్కింగ్ సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రత్యేకంగా పాలసీ తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం పలు రాష్ర్టాలు, దేశాల్లోని పాలసీలను అధ్యయనం చేసి అధికారులు పాలసీని రూపొందించినట్టు తెలిపారు. నగర పరిధిలోని మూడు కమీషనరేట్లలోని అధిక సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పాలసీని అమలు చేయనున్నట్లు, ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది చివరి నాటికి పాలసీ అమలును ప్రారంభిస్తామన్నారు.  స్థూలంగా పురపాలక శాఖ ప్రవేశపెట్టిన ఈ పార్కింగ్ పాలసీని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్ల దశల వారీగా అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పార్కింగ్ పాలసీ అమలుకై వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం వివిధ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పార్కింగ్ పాలసీ అమలు ప్రారంభమయ్యేనాటికి ఎక్కడ పార్కింగ్ అందుబాటులో ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

పార్కింగ్ పాలసీలోని ముఖ్యంశాలు-

•    ఈ పాలసీ ప్రకారం అన్ స్ర్టీట్ పార్కింగ్, షార్ట్ స్టే పార్కింగ్, నివాస భవనాల్లోని పార్కింగ్, ప్రభుత్వ కార్యాలయాలు/ బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్, భారీ వాహానాల పార్కింగ్, బస్సు, రైళ్ల్వే స్టేషన్లు, యంయంటియస్ స్టేషన్లలో పార్కింగ్,  ఖాళీ స్దలాలు( ఒపెన్ ప్లాట్ల పార్కింగ్) అనే వివిధ కేటగిరిలకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారు.

•    వీధులలో విశాలమైనటువంటి రోడ్లు ఉన్నచోటనే పార్కింగ్ అనుమతిస్తారు. కనీసం 12 మీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్లపైన పార్కింగ్కు అనుమతి ఇస్తారు. కేవలం కొద్దిసేపటి కోసం పార్కింగ్  చేసుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకులు, దుకాణాలు వంటి చోట్ల ఈ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం దుకాణాదారులే తమ వాహనాలను తమ ముందు రోడ్లపై రోజంతా పెట్టే పద్దతికి ఈ నిబంధన చరమగీతం పాడుతుంది. ఇలాంటి చోట్ల పార్కింగ్ గడువుపైన పరిమితులు విధించడం, పార్కింగ్ ఫీజు విధించడం వల్ల ఈ పద్ధతి కొనసాగేందుకు అవకాశం ఉండదు. ఇక భవన సముదాయాల నిర్మాణ కోసం రూపొందించిన బిల్టింగ్ నిభందనల్లో పొందుపర్చిన పార్కింగ్ సంబంధిత నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. నూతనంగా నిర్మించబోయేటువంటి భవనాల్లో బహిరంగ పార్కింగ్ కోసం నిర్మించే ప్లోర్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. ఇలాంటి సందర్భాల్లో భవన నిర్మాణాల నిభందనల్లో మినహాయింపు, ఆస్ధి పన్ను వంటి ప్రోత్సహకాలను ప్రకటించనున్నారు. సినిమా హాళ్లు, ఫంక్షన్ హళ్లు, హోటళ్లు, రెస్టారెంట్ల వంటి పబ్లిక్ ప్రదేశాల్లో డిమాండ్కు అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యతను ఆయా సంస్థలపైనే ఉంచేలా ఈ పాలసీలో నిబంధనలు రూపొందించారు. రోడ్లపైన భారీ వాహనాలను పార్కింగ్ చేసేటువంటి పద్ధతికి స్వస్తి పలికి, భారీ వాహనాల కోసం ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే నిలిపేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రయివేటు భాగస్వామ్యంలో పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా ఈ పాలసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.మల్టీ  లెవల్ పార్కింగ్ సౌకర్యాలను, పిపిపి లేదా ఇతర ప్రవేటు, ప్రభుత్వ భాగస్వామ్య పద్ధతుల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. పార్కింగ్ కు అనుకూలంగా ఉన్నటువంటి, ప్రైవేటు వ్యక్తుల ఖాళీ ప్లాట్లలో  పార్కింగ్ కు అనుమతి ఇచ్చేందుకు, ప్రత్యేకంగా లైసెన్స్ విధానాన్ని రూపొందించనున్నారు. ఖాళీ స్థలాలను పార్కింగ్ కోసం కేటాయించే వారికి 100% ఆస్ధిపన్ను మినహాయింపు ఇవ్వనున్నారు.

- Advertisement -