ఈ వ్యాధి చాలా ప్రమాదం.. జాగ్రత్త!

26
- Advertisement -

నేటి రోజుల్లో రకరకాల వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యులకు సైతం అంతుచిక్కని రోగాల కారణంగా ఎంతో మంది అర్ధాంతరంగా ప్రాణాలు విడుస్తున్నారు. కాబట్టి శరీరంలో వచ్చే మార్పులు ప్రాణాంతక రోగాలకు కారణం కావొచ్చు అందువల్ల వ్యాధుల విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి సుహాని భట్నాగర్ ( దంగల్ మూవీలో బాలనటి ) ” డెర్మటోమయోసైటీస్ ” అనే అరుదైన వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఈ ‘డెర్మటోమయోసైటీస్’ అనే వ్యాధి ప్రతి వెయ్యి మందిలో ఒకరికి అరుదుగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి స్త్రీ పురుషులలో ఎవరికైనా సంభవించే అవకాశం ఉందట. కానీ స్త్రీలు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది. .

ఈ వ్యాధి బారిన పడిన వారిలో అలసట, జ్వరం, త్వరగా బరువు కోల్పోవడం, కండరాల నొప్పి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయట. అయితే ఇవి సాధారణ ఆరోగ్య సమస్యలే అని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది లక్షణాలు కూడా పెరుగుతాయట. ముఖం, కాళ్ళు, చేతులు, ఛాతీ భాగం, వైలెట్ కలర్ లోకి మారడం, చర్మంపై దద్దుర్లు రావడం, మెల్లకన్ను ఏర్పడడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. కాబట్టి సకాలంలో వైద్యులను సంప్రదించకపోతే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డెర్మతోమయోసైటీస్ వ్యాధికి పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో లేదు కాబట్టి ప్రారంభ లక్షణాల నుంచే జాగ్రత్త వహిస్తూ వైద్యుల సలహా మేరకు మెడిసిన్ వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:బాస‌ర ట్రిపుల్ ఐటీ..నోటిఫికేష‌న్ రిలీజ్

- Advertisement -