కొబ్బరి నీళ్ళు తాగుతున్నారా.. ఇవి తెలుసా!

130
- Advertisement -

కొబ్బరి నీళ్ళు సీజన్ తో సంబంధం లేకుండా అన్నీ సీజన్లలో కూడా మార్కెట్ లో దొరుకుతుంటాయి. ఈ కొబ్బరి నీటిని తాగడానికి చాలమంది అమితమైన ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే.. కొబ్బరి నీటిని తాగడం వల్ల మన శరీరంలో చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందుకే రోగులకు డాక్టర్లు సైతం కొబ్బరినీళ్ళు తాగమని చెబుతుంటారు. ఎందుకంటే అనారోగ్య సమయాల్లో నీరసంగా ఉన్న, లేదా ఎవరైనా అలసటగా ఉన్నా.. అలాంటి సమయాల్లో కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల క్షణాల్లో శరీరం యాక్టివ్ గా మారుతుంది. ముఖ్యంగా శరీరం డీ హైడ్రేషన్ కు గురి అయినప్పుడు కొబ్బరినీళ్ళు తాగితే మన శరీరం నార్మల్ స్టేజ్ కు వస్తుంది.

ఎందుకంటే కొబ్బరినీటిలో యాక్టివ్ మినరల్స్ తో పాటు, పొటాషియం, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని అలసటను దూరం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందువల్లే డాక్టర్లు ఎక్కువగా కొబ్బరి నీరు తాగమని రిఫర్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ కొబ్బరినీరు తాగడం వల్ల రక్తంలోని పిహెచ్ లెవల్స్ సమతుల్యంగా ఉంటాయి.

ముఖ్యంగా వ్యాయామం చేసే టైమ్ లో కొబ్బరినీళ్ళు తాగడం వల్ల శరీరం నుంచి విడుదల అయ్యే ప్రీ రాడికల్స్ తో పై ప్రతిచర్య చూపి అలసటను పూర్తి తగ్గించి శరీరం చురుకుగా ఉండేలా చూస్తుంది. ఇక కొబ్బరినీటిలో ఉండే మెగ్నీషియం, యాంటీ యాక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంతో పాటు.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి. బయట దొరికే ఎనర్జీ డ్రింక్స్ తో పోలిస్తే సహజసిద్దంగా దొరికే కొబ్బరినీటిలోనే పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల కొబ్బరినీటిని తాగడం వల్ల వివిద రకాల కిడ్నీ సమస్యలకు కూడా చెక్ పట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం ఒక్క కొబ్బరి బోండా అయిన తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 Also Read:TTD: పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి

- Advertisement -