అరటిపండు గురించి మనందరికి తెలిసే ఉంటుంది. మన శరీరానికి అత్యంత విలువైన పోషకాలు అందించే ఫలాలలో అరటిపండు కూడా ఒకటి. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలతో పాటు.. విటమిన్- ఏ, బి, సి, ఇ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలోనూ, నాడీ వ్యవస్థను క్రమబద్దీకరించడంలోనూ అరటిపండు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పురుషుల్లో వీర్య కణాల వృద్దిని పెంచడంలో కూడా అరటిపండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న అరటిపండు.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్ళు తింటే తీవ్ర నష్టాలను కలుగజేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు అరటిపండుకు దూరంగా ఉండాలట ఎందుకంటే అరటిపండులో కార్బోహైడ్రేట్స్ మెండుగా ఉంటాయి.
అందువల్ల ఈ పండు తినడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నవారు అరటిపండు తినరాదని నిపుణులు చెబుతున్నారు. ఇక మైగ్రీన్ తో బాధపడే వాళ్ళు కూడా అరటిపండు కు దూరంగా ఉండాలట. అరటిపండులో ఉండే థయామిన్ కారణంగా తలనొప్పి సమస్య పెరిగి నాడీవ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే అరటిపండులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్ళు అరటిపండు ఎక్కువగా తింటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని న్యూట్రిషియన్స్ హెచ్చరిస్తున్నారు. హైపర్ కలేమియా, హైబీపీ వంటి వ్యాధులు ఉన్నవారు కూడా అరటికి దూరంగా ఉండాలి లేదంటే గుండె సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అరటిపండును తినే విషయంలో పై సమస్యలతో బాధపడే వారు తగు జాగ్రతలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Papaya:బొప్పాయితో లాభాలు