కాంగ్రెస్ ‘బీసీ’ గోల!

42
- Advertisement -

కాంగ్రెస్ లో సీట్ల పంచాయతి ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఆశావాహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించిన హస్తం పార్టీ అబ్యర్థులను ఎంపిక చేయడంలో మాత్రం తడబడుతోంది. ఎందుకంటే ఆ పార్టీలో అర్హత అనర్హత వంటి వాటితో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెట్టడంతో వాటిని వడబోయడంలో స్క్రినింగ్ కమిటీకి తల ప్రాణం తోకకొస్తోంది. గెలిచేది లేదు.. పోయేది లేదు హామీలే కదా ఇచ్చేస్తే పోలా అన్న రీతిలో హామీలు గుప్పించిన హస్తం పార్టీకి ఆ హామీలే ఇప్పుడు ఎసరు పెడుతున్నాయి. సీట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రదాన్యం ఇస్తామని ఓటర్లకు ఆకర్షించే ప్రయత్నం చేసిన.. ఇప్పుడు కేటాయించాల్సిన సమయం వచ్చే సరికి అబ్బే ఆ హామీలన్నీ నామ్ వస్తి అన్నట్లుగా వ్యవహరిస్తోంది హస్తం పార్టీ. .

ఈ నేపథ్యం బీసీలకు సీట్ల పంపకల విషయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీ నేతలు ముందుకు ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పిసిసి నిర్దేశించిన 34 స్థానాల్లో బీసీలకు సీట్లు కేటాయించక పోతే ఉరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే కొంత మంది బీసీ నేతలు నాలుగు రోజులుగా డిల్లీకి మకాం వేశారు. ఆగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లను కలిసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు వేణు గోపాల్ ను కూడా బీసీ నేతలు కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. సీట్ల పంపకల విషయంలో బీసీలకు అన్యాయం చేస్తే ఉరుకునేది లేదని హెచ్చరిస్తున్నారట. దాంతో వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనాలు వస్తున్న్మయి. కాగా ఆశావాహుల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు వస్తే అందులో బీసీలకు సంబందించి 40 స్థానాలు మాత్రమే ఆప్షన్ లో ఉన్నాయట దీంతో బీసీలకు ఏ విధంగా సీట్ల కేటాయింపు జరపాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారట హస్తం నేతలు. కాంగ్రెస్ బీసీనేతలు డిల్లీలో ఉన్నట్లు సీనియర్ నేత వి హనుమంతరావ్ కూడా తాజాగా కన్ఫర్మ్ చేశారు. దీంతో హస్తం పార్టీలో బీసీ గోల నిజమేనని తెలిస్తోంది. మరి హస్తం పార్టీ బీసీల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Also Read:క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -