- Advertisement -
ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం క్రీడా రంగానికి సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు లేకుండా క్రీడా వేదికలు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతించింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై మళ్లీ ఆశలు చిగురించగా వాటిని కొట్టిపారేసింది బీసీసీఐ. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ప్రస్తుతానికైతే ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచన బీసీసీఐకి లేదని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు.
‘ప్రయాణ ఆంక్షలు ఇంకా కొనసాగుతుండటంతో ఐపీఎల్ నిర్వహణ ఇప్పుడే సాధ్యంకాదన్నారు . క్రికెటర్లు తమ ట్రైనింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఒక అవకాశం లభించింది. ఆటగాళ్లు స్టేడియాలకు వెళ్లొచ్చు. ఔట్‌డోర్ ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చని తెలిపారు.
- Advertisement -