కొడుకుతో ఫన్నీ గేమ్‌ ఆడుతున్న మహేష్‌..!

165
Mahesh Playing Game With His Son Goutham

లాక్‌డౌన్ నేపథ్యంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఎక్కువ స‌మయాన్ని త‌న పిల్ల‌ల‌కే కేటాయిస్తున్నాడు. తన ఇద్దరు పిల్లలతో స‌ర‌దా గడుపుతున్నాడు. రీసెంట్‌గా త‌న కూతురు సితార‌తో పాట పాడుకుంటూ సంద‌డి చేసిన మ‌హేష్ ఇప్పుడు కొడుకు గౌత‌మ్‌తో స‌రదాగా ఫ‌న్నీ గేమ్ ఆడారు. అయితే వీటన్నింటిని నమ్రత తన ట్విట్టర్‌,ఇన్‌ స్టాగ్రాంలో ఖాతాలో పోస్ట్‌ చేస్తూవుంటుంది. తాజాగా మరో వీడియోను పోస్ట్‌ చేసింది. ఇందులో మహేశ్ బాబు తన కుమారుడితో ఫన్నీ ఆడుకుంటూ కనపడుతున్నాడు.

‘ఈ గేమ్‌ గురించి తెలియని వారి కోసం ఇది పోస్ట్ చేస్తున్నాను. ఇది బ్లింక్ అండ్‌ యు లూజ్ కాంపిటేషన్. అయితే, జీజీ (ఘట్టమనేని గౌతం) ఈ గేమ్ ఆడేటప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. కళ్ల రెప్పలు కొట్టకుండా ఉండలేకపోయాడు’ అని నమ్రత తెలిపింది. ఈ గేమ్‌ ఆడుతున్నప్పుడు కనురెప్పలు మూయకుండా ఉండాలి. ఎవరు ముందుగా కనురెప్పలు కొడితే వారు ఓడినట్లు. నెట్టింట్లో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.