టీమిండియా 2021-23 రెండేళ్ల షెడ్యూల్‌ని రిలీజ్ చేసింది బీసీసీఐ. రెండేళ్ల పాటు నాన్ స్టాప్ క్రికెట్‌తో ఫ్యాన్స్‌ని అలరించనున్నారు ఆటగాళ్లు.
ఏప్రిల్ నుంచి మే 2021 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగనుండగా జూన్ నుంచి జూలై 2021 వరకు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇండియా వర్సెస్ శ్రీలంక(3వన్డేలు, 5టీ20లు),ఆసియా కప్ ఆడనున్నారు.
తర్వాత జూలై 2021లో ఇండియా వర్సెస్ జింబాబ్వే(3వన్డేలు),జూలై నుంచి సెప్టెంబర్ 2021 వరకు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (5 టెస్టులు),
అక్టోబర్ 2021లో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా(3 వన్డేలు, 5టీ20లు),2021 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది.
నవంబర్ నుంచి డిసెంబర్ 21 వరకు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(2టెస్టులు, 3టీ2ఏలు), ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా(3టెస్టులు, 3టీ20లు) ఆడనున్నారు భారత ఆటగాళ్లు.
2022లో జనవరి నుంచి మార్చి వరకు ఇండియా వర్సెస్ వెస్టిండీస్(3వన్డేలు, 3టీ20లు), ఇండియా వర్సెస్ శ్రీలంక(3టెస్టులు, 3 టీ20లు) ఆడనుంది భారత్. ఏప్రిల్ నుంచి మే వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్,జూలై నుంచి ఆగస్టు వరకు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్(3వన్డేలు, 3 టీ20లు), ఇండియా వర్సెస్ వెస్టిండీస్(3వన్డేలు,3టీ20లు) ఆడనున్నారు. సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగనుండగా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్(2 టెస్టులు, 3టీ20లు), ఇండియా వర్సెస్ శ్రీలంక(5వన్డేలు) ఆడనుంది.
జనవరిలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(3వన్డేలు, 3టీ20లు) జరగనుండగా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(4టెస్టులు, 3వన్డేలు, 3టీ20లు) ఆడనుంది.