జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లోని బైసరన్ లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయాలకు అతీతంగా ఉగ్రదాడిని ఖండించగా ఇవాళ జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో బ్లాక్ రిబ్బన్స్‌తో ఆటగాళ్లు బరిలో దిగనున్నారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ , ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
Also Read:Pahalgam Attack:ఉగ్రవాదుల ఊహా చిత్రాలు
ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ చీర్ లీడర్స్ లేకుండానే మ్యాచ్ జరుగనుంది. అలాగే గెలిచిన తరువాత సెలబ్రేషన్స్ ఉండవని.. నల్ల బ్యాడ్జీలు ధరించాలని బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటిస్తారని ప్రకటించింది బిసిసిఐ. ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లను ధరించి ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తారు.


