ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్తాన్ నిర్ణయంపై బీసీసీఐ మౌనం వీడింది. ఈ అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ, ఐసీసీ వైఖరితో భారత క్రికెట్ బోర్డు పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఐసీసీతో చర్చించిన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. భారత్–పాక్ మ్యాచ్‌ను పాక్షికంగా బహిష్కరిస్తే పీసీబీపై చర్యలు తప్పవని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన గ్రూప్ దశ భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌ను బహిష్కరించనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా..ఐసీసీ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. క్రీడాస్ఫూర్తి గురించి వారు మాట్లాడారు. ఆ విషయంలో మేం ఐసీసీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఐసీసీతో మాట్లాడే వరకు బీసీసీఐ ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదు అని తెలిపారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనేందుకు పాక్ జట్టుకు అనుమతి ఇస్తున్నప్పటికీ, ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో మాత్రం పాక్ జట్టు మైదానంలోకి దిగదని పేర్కొంది.దీనిపై స్పందించిన ఐసీసీ, పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ, ఈ బహిష్కరణ వల్ల పాకిస్తాన్ క్రికెట్‌కు దీర్ఘకాలికంగా తీవ్రమైన ప్రభావాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్–పాక్ మ్యాచ్‌కు దూరమైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై పలు శిక్షలు విధించే అవకాశముందని ఐసీసీ స్పష్టం చేసింది.
Also Read:కేసీఆర్‌ను కలిసిన గూడెం మధుసూదన్

