బీసీలకు క్షమాపణ చెప్పాలి.. మోహన్ బాబుకు ఆర్ కృష్ణయ్య హెచ్చరిక..

211
- Advertisement -

టాలీవుడ్‌ నటుడు మోహన్ బాబు తీరుపై బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. అగ్ర కులానికి చెందిన సినిమా నటుడు మోహన్ బాబు డబ్బు, అధికార బలం ఉందన్న అహంకారంతో బీసీ వర్గంలోని నాయీబ్రాహ్మణ కులానికి చెందిన నాగశ్రీనుని కులం పేరుతో నీచంగా దూషించినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే సినీ మోహన్ బాబు మొత్తం నాయి బ్రాహ్మణ కులానికి బీసీ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

కేవలం ఒక్క శాతం కూడా లేని అగ్రవర్ణ కులానికి చెందిన మోహన్ బాబు 56 శాతం జనాభా కలిగిన బీసీ కులాలపై డబ్బు ఉందనే అగ్రకులానికి చెందిన వ్యక్తిననే ధైర్యంతో మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.. 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా పేద కులాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే బీసీ కులాలు తగిన గుణపాఠం నేర్పుతాయని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -