ఓటు వేసిన బీసీ కమిషన్ ఛైర్మన్ కృష్ణమోహన్ రావు

118
vakulabaranam
- Advertisement -

హుజూరాబాద్‌లో ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 10.5 శాతం ఓట్లు నమోదుకాగా రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హుజూరాబాద్‌, వీణవంక, కమలాపూర్ మండలాల్లో భారీ సంఖ్యలో ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటుండగా, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుండగా క్యూలో ఉన్న వారందరికి ఓటు వేసు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -