BB9 Telugu:హౌస్ రెండు భాగాలుగా!

22
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ షో ఆగస్టు 22, 2025 నుంచి జియోహాట్‌స్టార్లో ప్రసారం కానుంది. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సీజన్ హౌస్‌ను రెండు విభాగాలుగా విభజించారు.

ఒక ఇంట్లో పూర్తిగా కామనర్స్ ఉంటారు. మరొక ఇంట్లో సెలబ్రిటీలు ఉంటారు. కామనర్స్ విభాగంలో ఐదు లేదా ఆరు కొత్త ముఖాలు ఉండగా, మిగిలిన ఐదుగురు మాత్రం నవదీప్, బిందు మాధవి, అభిజీత్ హోస్ట్ చేస్తున్న అగ్నిపరిక్ష షో ద్వారా ఎంపికైన వారే.

Also Read:TTD:అందుబాటులోకి స్వామి పుష్కరిణి

గత సీజన్‌కు ఆశించినంత రెస్పాన్స్ రాకపోవడంతో ఈ సారి నిర్వాహకులు ఈ షోపై మరింత దృష్టి సారించారు. అందుకే కామన్ పిపుల్ వర్సెస్ సెలబ్రిటీలుగా ఈ సీజన్‌కు ప్లాన్ చేస్తున్నారు. అలాగే బిగ్ ట్విస్ట్‌లు ఉండేలా ఆడియన్స్‌కు అదిరే సర్‌ప్రైజ్‌ ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -