బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటినుండి ఎలిమినేట్ అయ్యారు శ్రీజ. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ముందు నుంచి హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. దానికి తగ్గట్లే ఎపిసోడ్ మొదట్లోనే ఫ్లోరా సైనిని ఓటింగ్ పరంగా ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత డేంజర్ జోన్‌లో ఉన్న ఐదుగురుకి (రీతూ, డీమాన్, సుమన్, సంజన, శ్రీజ) టాస్కులు పెట్టారు.
చివరిగా సుమన్ శెట్టి-శ్రీజ మిగలగా వీరిలో నుండి ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్ వైల్డ్‌కార్డ్స్ చేతికి ఇచ్చారు నాగార్జున. ఆరుగురిలో నలుగురు శ్రీజ ఎలిమినేట్ కావాలని కోరుకోగా మరో ఇద్దరు మాత్రం సుమన్ శెట్టి ఔట్ కావాలని ఓట్ చేశారు. దీంతో శ్రీజ ఎలిమినేట్ అయింది.
సడెన్ ఎలిమినేట్ కావడంతో జర్నీ వీడియో చేయలేకపోయాం అంటూ నాగార్జున చెప్పారు. ఎలిమినేషన్ గురించి ఏమనుకుంటున్నావని అడిగితే శ్రీజ ఇదే విషయం చెప్పింది. సాధారణంగా బిగ్‌బాస్‌లో ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ జరుగుతుంది.. కానీ అలా కాకుండా నేను స్ట్రాంగ్ అని తీసేయడం కరెక్ట్‌గా అనిపించలేదని శ్రీజ చెప్పింది. వెళ్లే ముందు డీమాన్‌కి ఫ్రెండ్, భరణికి ఎనిమీ, కళ్యాణ్‌కి ట్రస్ట్, సంజనకి రియల్, సుమన్‌కి వీక్, దివ్యకి ఫేక్, ఇమ్మూకి స్ట్రాంగ్, రీతూ, తనూజ, రాములకి గుడ్ అనే ఆప్షన్ ఇచ్చింది శ్రీజ.
Also Read:విదేశాల్లో #RT76!

