- Advertisement -
బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకోవడానికి వచ్చింది. గత వారం డేంజర్ జోన్‌లో ఉన్న ఫ్లోరా సైనీ..ఈ వారం కూడా ఉంది. ఈ వారం హౌస్ నుండి ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గేమ్‌లో ఆమె పాల్గొనడంలో ఆసక్తి చూపకపోవడంతో, ఆమె టీమ్ సభ్యులే నేరుగా ఆమెను నామినేషన్లలోకి పంపించారు.ఇటీవలి ఎపిసోడ్‌లలో ఫ్లోరా పూర్తిగా కనిపించకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కూడా ఆమెకు హెచ్చరిక జారీ చేస్తూ, మరింత యాక్టివ్‌గా ఉండాలని, ఇంట్లో స్పష్టంగా కనిపించాలని సూచించారు.
అయితే ఆ సూచన తర్వాత కూడా ఫ్లోరా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. దీంతో ఈ వారం ఆమె ఎలిమినేషన్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:ఇందిరమ్మ పాలన కాదు..ఎమర్జెన్సీ:హరీష్
- Advertisement -

