BB9:ఫ్యామిలీ వీక్..సర్‌ప్రైజ్

5
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 73 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా హౌస్‌మేట్స్ అందరిని వరుసగా నిల్చోబెట్టి పెద్ద క్లాస్ పీకాడు బిగ్ బాస్. బిగ్‌బాస్ ఇంట్లో మీ ప్రయాణం చివరి అంకానికి అతి చేరువలో ఉంది.. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సాగిన మీ ప్రయాణం మిమ్మల్ని ఎన్నో భావోద్వేగాలకి గురి చేసింది.. పరిస్థితులు ఏమైనా కొన్ని బంధాలు మాత్రమే ఎప్పటికీ మీ తోడుని వదలవు.. అలాంటి బంధాల్ని మీ ప్రయాణం కోసం ఈ ఇంటి బయటే వదిలేసి మీ లక్ష్యం కోసం ఈ ఇంట్లో అడుగుపెట్టారు.. ట్రోఫీ వైపు ఎంత ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తారన్నది మీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది.. ఇందుకోసం మీకు నేను పెడుతున్న పోటీ చిక్కుముడి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.

ఈ పోటీలో ఎవరు ఏ స్థానంలో నిలుస్తారో దాన్ని బట్టి బోర్డ్ మీద ఉన్న టైమ్ ఫ్రైమ్ దక్కుతుంది. అత్యధికంగా 60 నిమిషాల సమయం ఈ బోర్డు మీద ఉంటే.. అతి తక్కువ సమయం 15 నిమిషాలుగా ఉంది…మీరు మీ కుటుంబంతో గడిపే ప్రతి నిమిషం.. వారు మీకు తెలిపే ప్రతి విషయం మిమ్మల్ని ట్రోఫీ వైపు ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని తెలిపారు బిగ్ బాస్.

సంజన పోటీలో లేదు కాబట్టి సంచాలక్‌గా నియమించారు బిగ్ బాస్. తనూజ కెప్టెన్ అయిన కారణంగా మీరు ఈ పోటీలో పాల్గొనాల్సిన అవసరం లేదు.. బోర్డులో మీకు నచ్చిన టైమ్ కార్డ్‌ని ఎంచుకోండి అంటూ షాకిచ్చాడు బిగ్‌బాస్. ఇంకేముంది తనూజ ఎగిరి గంతేసి 60 నిమిషాల బోర్డు తీసేసుకుంది. ఇది చూసి మిగిలిన హౌస్‌మేట్స్‌ ముఖచిత్రాలు నో ఎక్స్‌ప్రెషన్, నో కామెంట్స్ అన్నట్లుగా మారిపోయాయి.

మిగిలిన మెంబర్స్ ఆడి తమకి వచ్చిన స్థానం బట్టి టైమ్ బ్యాడ్జెస్ తీసుకున్నారు. అయితే కళ్యాణ్ మాత్రం తాను గెలిచిన 20 నిమిషాల సమయాన్ని సుమన్ శెట్టికి త్యాగం చేశాడు. సుమన్‌కి వచ్చిన 15 నిమిషాలు తీసుకున్నాడు. ఆ తర్వాత ముందుగాా సుమన్ శెట్టి ఫ్యామిలీ టైమ్ మొదలైంది. దీంతో సుమన్ శెట్టిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి 15 నిమిషాలు సరిపోదని మీకు అనిపిస్తే హౌస్‌మేట్స్‌లో ఎవరినైనాా కన్విన్స్ చేసుకొని వాళ్లతో స్వాప్ చేసుకోమని బిగ్‌బాస్ కోరాడు.

Also Read:ఏసీబీ వలలో టెక్మాల్ పీఎస్‌ ఎస్‌ఐ

- Advertisement -