బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా 16 రోజులు పూర్తి చేసుకుంది. మూడోవారం నామినేషన్ ప్రక్రియ ముగియడంతో హౌస్‌లో వేడి కాస్త తగ్గింది. మూడోవారం నామినేషన్స్‌లో తనకి వచ్చిన స్పెషల్ పవర్‌తో ఒకరిని సేవ్ చేసే అవకాశం రాగా కెప్టెన్ డీమాన్.. రీతూ చౌదరిని సేవ్ చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే దమ్ము శ్రీజని సేవ్ చేశాడు పవన్. ఇక నామినేషన్స్ పూర్తయిన తర్వాత రీతూ చౌదరి ఎమోషనల్ అయింది. ఏమైంది చెప్పు అని డీమాన్ అడిగితే నేను ఎందుకు నామినేట్ అయ్యానో నీకు తెలుసా.. నిన్ను కెప్టెన్ చేసింది నేనే అంటూ అందరూ నన్ను నామినేట్ చేశారు అంటూ రీతూ ఎమోషనల్ అయింది.
ఆ తర్వాత మళ్లీ రీతూను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్ బాస్. మీ ఎదురుగా ఒక క్లాత్ ఉంది అది తీసేయండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పడు. అందులో చికెన్ చూసి బిగ్‌బాస్ అంటూ రీతూ ఏడుపు అందుకుంది. అదేంటి రీతూ మీరు నవ్వుతారనుకుంటే ఏడుస్తున్నారు.. అంటూ బిగ్‌బాస్ అవాక్కయ్యాడు. చికెన్ కోసం ఇంటి సభ్యుల రహస్యాలు చెప్పడానికి మీరు సిద్ధమని చెప్పడం నేను విన్నాను.. నిజంగా మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని బిగ్‌బాస్ అడిగాడు.
ఓకే అని చెప్పింది రీతూ. ముందు మీ ఫ్రెండ్ తనూజతో మొదలుపెట్టండి.. అని బిగ్‌బాస్ అడిగాడు. తనూజకి ఒక పర్సన్ అంటే ఇష్టం, క్రష్ అని తనే చెప్పింది.. తనూజకి కొంచెం సాఫ్ట్ కార్నర్ కళ్యాణ్ మీద కూడా ఉంది అని చెప్పింది. ఇది విన్న తర్వాత చికెన్ అంటే నీకు అంత ఇష్టం కాదనిపిస్తుంది అంటూ బిగ్‌బాస్ షాకిచ్చాడు.తర్వాత పవన్ గురించి చెబుతూ తను ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పాడు.. లవ్ చేసిన అమ్మాయికి కరెక్ట్‌గా ప్రపోజ్ కూడా చేయలేదు.. ఆ అమ్మయికి వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయిందని చెప్పాడు అంటూ చిట్టా మొత్తం విప్పేసింది రీతూ.
ఇక కన్ఫెషన్ రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత రీతూతో మాట్లాడాడు డీమాన్. నిన్న ఏడ్చా కదరా దాని గురించే పిలిచారు అని చెప్పింది. తర్వాత అందర్నీ గార్డెన్ ఏరియాకి పిలిచి అక్కడ ఏర్పాటు చేసిన ఆపిల్ చెట్టు ముందు నిల్చోమన్నాడు బిగ్‌బాస్. ఈ రెండు వారాలుగా నేను నా ఇంట్లో మీ ఆటలు మీ నవ్వులు మీ గొడవలు అన్నింటినీ గమనిస్తున్నాను..ఇప్పుడు జరగబోయేది మీ ఊహకి మించి ఉండబోతుంది.. ఎందుకంటే ఇది మీ నామినేషన్స్, కంటెండర్ షిప్, కెప్టెన్సీ, ఇంకా ఎవరు ఈ ఇంట్లో ఉండాలి అన్నదానిపై కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పాడు.
ఈ ప్రయాణం మొదట్లో మీరు నాటిన విత్తనాలు ఇప్పుడు ఫలాలుగా మారి ఈ చెట్టుపై వేలాడుతున్నాయి.. ఇందులోని కొన్ని పళ్లు మీరు పడ్డ కష్టం..శ్రమ ఫలితంగా తీపిగా మారాయి.. ఇంకొన్ని పళ్లు మీరు ఊహించని రుచితో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.. ఈ రెండు వారాల మీ ఆట చూశాక ఏ ఫలం ఎవరికి దక్కాలో నేను నిర్ణయించాను.. ఇంటి సభ్యులంతా మీ పేరున్న ఫలాన్ని తీసుకోండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
తర్వాత భరణి, హరీష్, రాము, పవన్ కళ్యాణ్, డీమాన పవన్ (రెడ్ టీమ్),ఇమ్మూ, తనూజ, సంజన, సుమన్ శెట్టి, ప్రియ (బ్లూ టీమ్),ఫ్లోరా, రీతూ, శ్రీజ (బ్లాక్ టీమ్)లో ఉండగా బ్లూ విత్తనం లభించిన వారందరికీ ఇప్పుడు నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నాను.. ఈ అవకాశం ద్వారా ఇంటి నుంచి వచ్చిన కొన్ని సందేశాలను జ్ఞాపకాలను మీ మనసుకి దగ్గరైన కొన్ని విషయాలను మీరు నెమరు వేసుకోగలరు అని చెప్పారు. ఫస్ట్ టైమ్ బజర్ ఇమ్మానుయేల్ కొట్టాడు. దీంతో ఇమ్మూని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి మూడు ఆప్షన్ ఇచ్చాడు బిగ్‌బాస్. మీ నాన్న దగ్గరి నుంచి ఒక లెటర్ వచ్చింది.. అది కావాలంటే బ్యాటరీలో 45 శాతం ఖర్చు చేయాలి.. రెండోది మీ అమ్మ దగ్గరి నుంచి ఒక ఆడియో మెసేజ్ వచ్చింది.. అది కావాలంటే 35 శాతం బ్యాటరీ తగ్గుతుంది. ఇక చివరిగా మీ ఫ్యామిలీ ఫొటో ఉంది అది కావాలంటే 25 శాతం బ్యాటరీ ఖర్చు చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో తప్పక అందరికీ అవకాశం రావాలని తక్కువ బ్యాటరీ ఖర్చు అయ్యే ఫొటోనే సెలక్ట్ చేశాడు ఇమ్మూ.
Also Read:తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025కు అతిథిగా కేటీఆర్

