BB9:హరిష్ ఎలిమినేట్

8
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. నాలుగోవారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు హరీష్‌. దివ్య-హరీష్ మధ్య ఎలిమినేషన్ జరుగగా ఇద్దరిని యాక్టివిటీ రూమ్‌కి పిలిచారు నాగార్జున. అక్కడున్న గ్లౌజ్‌ వేసుకోండి.. కౌంట్‌డౌన్ అయ్యాక వెనకాల ఉన్న స్క్వేర్స్ బ్రేక్ చేయండి.. అందులో మీ ఫొటో ఉంటుంది.. ఎక్కడో ఒక చోట మీరు సేఫా.. అన్‌సేఫా అని క్లియర్‌గా ఉంటుంది.. అంటూ నాగార్జున చెప్పారు. ఇక ఇద్దరూ ఒకేసారి ఆ బాక్సులు బద్దలుకొట్టారు. ఇందులో దివ్య సేఫ్ కాగా హరీష్ ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకి వచ్చాడు.

హరీష్ ఎక్కడా ఎమోషనల్ కాకుండా ఓకే సార్ అన్నాడు. స్టేజ్ మీదకు వచ్చిన హరీష్‌కు టాస్క్ ఇచ్చారు నాగ్. ఈ హౌస్‌లో ఎవరు బ్లాక్ మాస్క్ పెట్టుకొని ఉన్నారు. ఎవరు వైట్ మాస్క్ పెట్టుకున్నారు అని అడగ్గా ముందుగా బ్లాక్ మాస్క్‌ మీద భరణి ఫొటో పెట్టాడు హరీష్. ఇన్ఫ్లుయెన్స్ అనే పేరుతో అందరినీ ఆయన మేనిపులేట్ చేయగలరు అని చెప్పాడు. తర్వాత బ్లాక్ మాస్క్ మీద ఇమ్మానుయేల్ ఫొటో పెట్టాడు. సార్ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్.. కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది.. కానీ ఆయన నిజ స్వరూపం ఇంకా బయటికి చూపించలేదని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. చివరిగా బ్లాక్ మాస్క్ డీమాన్ పవన్‌కి ఇచ్చాడు హరీష్.

వైట్ మాస్క్‌లో మొదటిగా శ్రీజ ఫొటో పెట్టాడు హరీష్. తను ఇక్కడేంటో అగ్నిపరీక్షలో కూడా అంతే సార్.. ఎక్కడా ఏ మార్పూ రాలేదు. మీరు తుత్తర అంటారు చూశారా అది నిజం.. ఆమెకి కాస్త తొందరెక్కువ అని చెప్పాడు. తర్వాత కళ్యాణ్‌కి వైట్ మాస్క్ ఇచ్చాడు. చివరిగా వైట్ మాస్క్‌పై తనూజ ఫొటో పెట్టాడు హరీష్. ఇది చూసి అటు తనూజ ఇటు నాగార్జున ఇద్దరూ సర్‌ప్రైజ్ అయ్యారు. నాలో ఎంతో కొంత నేను తనూజని చూసుకుంటా సార్.. బేసికల్‌గా మా ఇద్దరి ఫేస్ సీరియస్‌గా ఉన్నట్లు ఉంటుంది కొన్ని సందర్భాల్లో కానీ మనసులో ఏం ఉండదు.. కొంత షార్ట్ టెంపర్ ఎక్కువ ముక్కు మీద కోపం అంటూ హరీష్ చెప్పాడు.

Also Read:Kantara:రూ.200 కోట్లకు చేరువలో!

- Advertisement -