బిగ్‌బాస్ 9 తెలుగు షో ఆదివారం ప్రసారమైన 99వ ఎపిసోడ్‌లో ఊహించని డబుల్ ఎలిమినేషన్‌తో ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయగా, ఆదివారం ఎపిసోడ్‌లో భరణి శంకర్‌ను కూడా బయటకు పంపించి ‘డబుల్ ఢమాకా’ మోగించారు. దీంతో సీజన్ 9 చివరి వారం మరింత ఉత్కంఠగా మారింది.
భరణి ఎలిమినేషన్ అనంతరం హోస్ట్ నాగార్జున బిగ్‌బాస్ సీజన్ 9 ఫైనలిస్ట్‌లను అధికారికంగా ప్రకటించారు. తనూజ, కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్, ఇమ్మానుయేల్, సంజనా – ఈ ఐదుగురు ఫైనలిస్ట్‌లుగా నిలిచారు. ఇప్పటికే కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలవగా, మిగిలిన నలుగురిని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఎలిమినేషన్ టాస్క్ నిర్వహించారు.
చివరి రౌండ్‌లో సంజనా, భరణి ఇద్దరినీ యాక్టివిటీ రూంకి పిలిచారు. పక్షి రెక్కల ద్వారా ఫైనలిస్ట్, ఎలిమినేషన్ బోర్డులను లాగమని చెప్పగా, సంజనాకు ఫైనలిస్ట్ బోర్డు రావడం, భరణికి ఎలిమినేషన్ బోర్డు రావడం జరిగింది. దీంతో భరణి శంకర్ ప్రయాణం బిగ్‌బాస్ హౌస్‌లో ముగిసింది.
భరణి ఎలిమినేట్ కాగానే ఇమ్మానుయేల్ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు తనూజ మాత్రం భావోద్వేగానికి లోనై సైలెంట్‌గా ఉండిపోయింది. భరణి బయటకు వెళ్తూ ‘నా వల్ల ఎవరైనా బాధపడ్డారంటే క్షమించండి. మీరంతా టాప్ 5కి అర్హులు’ అంటూ హౌస్‌మేట్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తనూజ భరణి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం ఎమోషనల్ మూమెంట్‌గా నిలిచింది.
Also Read:నిర్మాణ రంగంలోకి వెంకీ కుడుముల
స్టేజ్‌పైకి వెళ్లిన భరణికి జర్నీ వీడియో చూపించారు. అనంతరం నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి మంచి మాటలు చెప్పిన భరణి, చివరగా తనూజతో మాట్లాడుతూ భావోద్వేగంగా స్పందించారు. తనూజ ట్రోఫీ గెలవాలని ఆకాంక్షించగా, తానే ట్రోఫీ కొడతానని తనూజ మాటిచ్చింది.చివరగా నాగార్జున విన్నర్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశామని, శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ కొనసాగుతుందని ప్రకటించారు. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది.

