BB6..కెప్టెన్‌గా ఆర్జే సూర్య..

151
BB6
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 40 రోజులు పూర్తి చేసుకుంది. 41వ ఎపిసోడ్‌లో భాగంగా హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా ఆర్జే సూర్య ఎంపికయ్యారు. గత వారం కెప్టెన్‌ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇంటి సభ్యులకే వదిలేయగా రేవంత్ కెప్టెన్ అయ్యారు. తాజాగా కెప్టెన్సీ టాస్క్ ఫస్ట్ రౌండ్‌లో వాసంతి, ఆర్జే సూర్య, ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్,రోహిత్, శ్రీ సత్య, రేవంత్, రాజ శేఖర్‌లు ఎంపిక కాగా.. రెండో రౌండ్‌కి ఆర్జే సూర్య, రోహిత్‌లు క్వాలిఫై అయ్యారు. వీరిద్దరిలో కెప్టెన్‌గా ఎవరు అవుతారో ఇంటి సభ్యులకే వదిలేయగా ఆర్జే సూర్యకు మెజార్టీ సభ్యులు మద్దతివ్వడంతో ఆయనే కెప్టెన్ అయ్యారు.

ఇక అంతకముందు ఇంటి సభ్యులందరి సంతోషం కోసం బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో రోహిత్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఇది రోహిత్‌కి ప్లస్‌గా మారింది. రోహిత్‌ ఇంటి సభ్యుల కోసం త్యాగం చేస్తే ఇంటి సభ్యులంతా ఆర్జే సూర్యని కెప్టెన్ చేశారు.

ఇక ఆర్జే సూర్య కెప్టెన్ కావడంతో.. ఇనయ ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే ఇప్పటివరకు హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తున్న ఇనయ…సూర్య కెప్టెన్‌ కావడంతో రొమాన్స్‌ మరింత పెంచే ఛాన్స్ ఉంది.

- Advertisement -