బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 52 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. 52వ ఎపిసోడ్‌లో భాగంగా కెప్టెన్సీ పోటీ కోసం చేపల చెరువు అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ నిజంగానే చేపల మార్కెట్‌ను తలపించింది.
ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు జంటలుగా విడిపోయి గార్డెన్ ఏరియాలో కురిసే చేపల వర్షంలో వీలైనన్ని చేపల్ని పట్టుకుని జాగ్రతపరుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత బిగ్‌బాస్ అడిగినప్పుడు అత్యంత తక్కువ చేపలు ఉన్న జంట పోటీ నుంచి నిష్క్రమిస్తుంది. మధ్య మధ్యలో బిగ్‌బాస్ ఇచ్చే ఛాలెంజ్‌లో గెలిచిన సభ్యులు తమ వద్ద ఉన్న చేపల సంఖ్యని పెంచుకోవచ్చు. ప్రతి ఛాలెంజ్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకోవడానికి హారన్ మోగినప్పుడు ప్రతి జంటలో ఒక సభ్యుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పూల్‌లో దిగి అందులో ఉన్న గోల్డ్ కాయిన్‌ని వెతకాల్సి ఉంటుందని చెప్పారు.
జంటలుగా ఆడింది ఎవరంటే… సూర్య- వసంతి, రేవంత్- ఇనయ, శ్రీహాన్- శ్రీసత్య, బాలాదిత్య -మెరీనా, ఆదిరెడ్డి -గీతు,. రోహిత్ -కీర్తి, రాజ్- పైమా ఆడారు. రేవంత్‌ను రెచ్చగొట్టేలా గీతూ ప్లాన్ వేయగా అది విఫలమైంది. తర్వాత ఆదిరెడ్డిని బ్లాక్ చేసిన హౌస్‌మెట్స్ గీతు నుంచి కొన్ని చేపల్ని దొంగలించారు.తాను అందరినీ టార్గెట్ చేస్తానని రెచ్చిపోయింది గీతూ.
ఈ టాస్క్‌లో భాగంగా ఫుష్ ఫర్ ఫిష్ అనే ఫస్ట్ ఛాలెంజ్‌లో రాజ్, బాలాదిత్య విజయం సాధించారు. సెకండ్ రౌండ్‌లో రాజ్, పైమా గెలిచి పది చేపల్ని సాధించుకున్నారు. ఎపిసోడ్ ముగిసే సమయానికి రేవంత్- ఇనయ వద్ద అత్యధికంగా 58 చేపలు ఉన్నాయి.

