BB6…నామినేషన్స్ రచ్చ

76
BB6
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 36 రోజులు పూర్తిచేసుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది నిలవగా రోహిత్ – ఆదిరెడ్డి మధ్య గొడవతో రచ్చరచ్చగా సాగింది. ఎంటర్ టైన్ చేయడం లేదని అంటున్నారు కదా.. నేను వెళ్తూ.. వెళ్తూ.. చాలామంది కంటే బెటర్‌గా డాన్స్ వేసి చూపిస్తాను అని ఆదిరెడ్డి శపదం చేస్తూ మెరీనా- ఆదిరెడ్డిని ఉద్దేశిస్తూ పరోక్షంగా టార్గెట్ చేశారు. దీంతో గొడవ స్టార్ట్ అయింది.

నాగార్జున చెప్పినట్టు నేను కెప్టెన్‌గా ఫెయిల్ అయిన మాట నిజం.. కానీ మీ ఇద్దరితో జరిగిన పాయింట్‌లో తప్పు మీదే నాది కాదు అని గట్టిగా అరిచాడు. దీంతో రోహిత్.. నేను మాట్లాడొచ్చా?? అంటూ సీన్‌లోకి వచ్చి….శుక్ర, శనివారాల్లో రూల్ ఏంటి? అని అడిగాడు.. ఆ మాటతో ఆదిరెడ్డి.. బ్రో.. నేను చెప్పేది మీకు అర్ధం కాలేదా? అని అన్నాడు. దీంతో రోహిత్.. నువ్ వాయిస్ రేజ్ చేస్తే నేనూ చేస్తా.. అని గట్టిగా అరిచాడు.  నీ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడు.. వైఫ్‌తో కలిసి ఆడటం కాదు నోరు జారాడు ఆదిరెడ్డి.

దీంతో ఆదిరెడ్డిని కొట్టడానికి వెళ్లినట్టు వెళ్లాడు రోహిత్. ఆదిరెడ్డి కూడా రోహిత్ మీదికి దూసుకుని రావడంతో.. వీళ్లిద్దరూ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మిగిలిన వాళ్లంతా సినిమా చూస్తున్నట్టు చూశారు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్‌లో కీర్తి, ఆదిరెడ్డి, గీతు, ఆదిత్య, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీ సత్య, మెరీనా ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచిచూడాలి…

- Advertisement -