- Advertisement -
బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు అప్పుడే తొలివారం పూర్తి చేసుకుంది. తొలివారంలో సరయు ఎలిమినేట్ అయి ఇంటి నుండి బయటికి వచ్చేసింది. ఇక సోమవారం మరోసారి హౌజ్‌లో రచ్చ మొదలైంది. మొదటి వారంలో చాలా సైలెంట్‌గా కనిపించిన శ్వేతా వర్మ.. రెండో వారంలోకి వచ్చేసరికి విశ్వరూపం చూపించింది. ఇప్పటి వరకు ఈ ఆదిశక్తిని ఎక్కడ దాచావమ్మా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక నామినేషన్స్ టైమ్‌లో ఇంటి సభ్యులు నక్క, గద్ద టీమ్స్‌గా డివైడ్ అయిపోయారు.. ఈ ప్రక్రియలో ఏడుగురు సభ్యులను నామినేట్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో నక్క టీమ్‌లో నుంచి ఉమా, నటరాజ్, కాజల్, గద్ద టీమ్‌లో నుంచి లోబో, ప్రియాంక, యానీ, ప్రియ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. అలా చివరకు రెండో వారంలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, అనీ మాస్టర్, ప్రియలు నామినేట్ అయ్యారు.
- Advertisement -