మంథనిలో బతుకమ్మ చీరల పంపిణీ..

740
putta madhu
- Advertisement -

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఎస్ ఎల్ వి ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత ,జడ్పీ చైర్మన్ పుట్ట మధు. ఈ సందర్భంగా ఎంపీ బోర్లకుంట వెంకటేష్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా గుర్తించి మహిళలకు కానుకగా చీరల పంపిణీ చేసి గౌరవం ఇచ్చి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని చెప్పారు.పేదింటి ఆడబిడ్డలకు ఒక పెద్ద కొడుకు లాగా అన్నీ తానై వారికి అండగా ఉంటూ అన్నలా అదుకుంటున్నారని చెప్పారు.

తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్ళు తెలంగాణ వస్తే ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూస్తే తెలుస్తుంది ఏమొచ్చిందో అని తెలిపారు జడ్పీ చైర్మన్ పుట్ట మధు . తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి మహిళలకు చీరల పంపిణీ చేస్తుంటే ప్రతి మహిళ సీఎం కేసీఆర్ ను అన్న లా భావిస్తూ నిండు నూరేళ్ళ బతకాలని ఆశీర్వదిస్తున్నారని చెప్పారు.

- Advertisement -