స్విట్జర్లాండ్‌లో సద్దులబతుకమ్మ సంబరాలు..

501

తెలంగాణ జాగృతి స్విట్జర్లాండ్ అద్వర్యంలో మహా బతుకమ్మ వేడుకలు జురిచ్ నగరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు పిల్లలు ఉత్సాహంగా పాలుగొని బతుకమ్మ, కోలాటం ఆడారు. కార్యక్రమంలో గాయని స్వాతి రెడ్డి పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Bathukamma Celebrations in Switzerland

ఈ ఉత్సవాలలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ స్థానిక ప్రతినిధులు బార్బరా జిక మరియు మథియాస్ జిక కూడా పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడి ఆనందించారు. మాతృ భూమికి దూరంగా ఉన్నా.. సంస్కృతి సంప్రదాయాలను పాటించడం గురించి వారు ఈ సందర్భంగా అభినందించారు.

Bathukamma Celebrations in Switzerland

తెలంగాణ జాగృతి అధ్యక్షులు కిషోర్ తాటికొండ మరియు జనరల్ సెక్రటరీ అనిల్ జాలల, తెలంగాణ రాష్ట్ర సమితి స్విట్జర్లాండ్ అధ్యక్ష ఉపాధ్యక్షులు శ్రీధర్ గందే, అల్లు కృష్ణ రెడ్డి, పవన్ దుద్దిళ్ల, యువరాజ్ రాచకొండ, పద్మజ రెడ్డి తదితరులు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసారు.

Bathukamma Celebrations in Switzerland