మెల్బోర్న్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు..

285
melborne bathukamma
- Advertisement -

తెలంగాణలో ఏ ఊళ్ల చూసినా.. పట్నంలా ఎక్కడా చూసినా బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. అంతేకాదు తెలంగాణ సాంస్కృతిక సంపద బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. ఆఫీసులు, బడులు, గుడులు, అంగడిలు, చౌరస్తా, గల్లీ యాడ సూసినా బతుకమ్మ పాటలే.. పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చి ముద్దుగా ఆడుతున్నరు.. ఉన్నోళ్లు.. లేనోళ్లు అందరూ బతుకమ్మ సంబురంలనే ఉన్నరు. ఆడోళ్లకు ఇదే పెద్ద పండుగ.

తెలంగాణలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో బతుకమ్మ ఉత్సవాలు ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో, కమ్మని తెలంగా విందు తో కనుల పండుగగా జరిగాయి. సుమారు మూడు వేల మంది అథితులు హాజరైన ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు భోలే షావలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బోలే శావలి సంగీత దర్శకత్వంలో సమకూర్చిన కోలో కోలో కోల్, ఆకుపచ్చ పండగొచ్చెనే చెల్లెలా బతుకమ్మ పాటలతో ఎంతో ఉత్సాహంగా ఆడ పడచులతో ఆడి పాడారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ప్రతి ఒక్క తెలంగాణ వాసి కృషి చేయాలని అన్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ వంటలు డబల్కా మీట, గవ్వలు, సకినాలు సర్వపిండి, పచ్చి పులుసులతో వడ్డించిన విందు భోజనం వచ్చిన ఆహుతలందరికీ స్వదేశాన్ని గుర్తు చేశాయి.

- Advertisement -