ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

250
- Advertisement -

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాల్లో ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు మలేషియా, సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో కౌలాలంపూర్ బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పెద్ద ఎత్తన ఎన్‌ఆర్‌ఐలు హాజరై.. ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయబద్దంగా తయారై.. బతుకమ్మను పేర్చి ఉయ్యాల పాటలు పాడుతూ అలరించారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాష్, ఇండియా కౌన్సిల్ ఆఫ్ మలేషియా నిషిత్ కుమార్ ఉజ్వల స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. అనంతరం అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి వెయ్యి మందికి బహుమతులు అందజేశారు.

ఇక సింగపూర్ ఆడపడుచులంతా కలిసి 6 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తెలంగాణ ప్రముఖ గాయకురాలు వొల్లల వాని, మిట్ట సౌమ్య ఆట పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని.. వెయ్యి ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి అన్నారు.

ఈ బతుకమ్మ సంబురాల్లో మహిళలు అధిక సంఖ్యలో బతుకమ్మలను పేర్చి.. ఆటపాటలు, కోలాటాల విన్యాసాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నపెద్ద తేడా లేకుండా.. ఆడపడుచులంతా బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.

- Advertisement -