ఆస్ట్రేలియా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్పీ కవిత..

267
mlc kavitha
- Advertisement -

ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. ఈసారి కోవిడ్‌ నిబంధనల కారణంగా ఆన్‌లైన్‌లో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేషన్స్ తో ప్రారంభమై తొమ్మిది రోజులు ఘనంగా జరిపారు. మొదటిరోజు ఉత్సవాలకి ప్రపంచంలో ఉన్న తెలంగాణ సంఘాలు హాజరై శుభాకాంక్షలు తెలిపాయి. అలాగే సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు పాల్గొన్నారు.

కవిత మాట్లాడుతూ.. ఏటీఏఐ ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారని.. అయితే ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా ఉత్సవాలు ఆన్‌లైన్‌లో జరుపుకోవడం జరిగాయి. తెలంగాణ సాంప్రదాయాలని కాపాడుతూ ఆస్ట్రేలియాలో ఇంత ఘనంగా ఉత్సవాలు జరిపినందుకు కార్యవర్గాన్ని అభినందించారు.

అలాగే మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా తెలంగాణ సంఘం అటు తెలంగాణలోనూ ఇటు ఆస్ట్రేలియాలో వారు చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. ముఖ్యంగా కోవిడ్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉండి పండుగ జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఏటీఏఐ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన వచ్చిన కవితకి అలాగే మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే కార్యవర్గ సభ్యులు కిరణ్ పాల్వాయి, ఫణీ, వంశీ ,మహేష్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా నుండి ప్రముఖ గాయని తేలు విజయ లైవ్‌లో పాటలు పాడి అందర్నీ ఆహ్లాద పరిచారు. ప్రతి సంవత్సరం దాదాపు 5 నుంచి 6 వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమం ఈసారి కోవిడ్‌ వల్ల ఆన్‌లైన్‌లో జరుపుకోవడం జరిగిందని అధ్యక్షుడు అని బైరెడ్డి తెలిపారు.

- Advertisement -