బతుకమ్మ పండగలో ప్రథమ స్థానం పూలదే. ఏటి గట్లపై, పొలం గట్లపై విరబూసిన అచ్చమైన పల్లె పూలే బతుకమ్మలో అందంగా ఒదిగిపోతాయి. రంగురంగుల హరివిల్లులా పరుచుకుంటాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వుతో.. తీరు తీరున బంగారు బతుకమ్మను అలంకరిస్తారు.తంగేడు, బంతిపూలు, చేను చెలకలలో పెరిగే గునుగుపూలు, పట్టుకుచ్చులు, ముళ్ళకంచెలపై కనిపించే కట్లపూలు, పెరట్లో పెరిగే మందారాలు, గన్నేరు.. గుమ్మడి.. ఒక్కటేమిటి ఎన్నో రకాల పూలు బతుకమ్మలో కొలువవుతాయి. అందుకే ఈ పండగ ప్రకృతిని ఆరాధించే చిహ్నంగా కీర్తిపొందుతోంది.
అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు బతుకమ్మను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి స్థానిక టాంపనిస్ సెంట్రల్ పార్క్ నందు జరుపుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత గాయని వరమ్ ప్రత్యక్ష గానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ పసందైన భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక మొదటి 3 ఆకర్షణీయమైన బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు.
Also Read:జయం రవి…’గాడ్’ సెన్సార్ పూర్తి