తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు

503
bathukamma
- Advertisement -

తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి , మాజీ ఎం.పి గుండు సుధారాణి , మాజీ జెడ్పి చైర్మన్ తుల ఉమా , పలువురు కార్పొరేటర్లు , మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

telangana bhavan

బతుకమ్మ సంబురాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సద్దుల బతుకమ్మ ఉత్సవానికి హుస్సేన్ సాగర్ తీరం ముస్తాబవుతోంది.రంగుల రంగుల దీపాలు,ఫ్లెక్సీలతో ముస్తాబు చేస్తోంది. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్‌లో ప్రత్యేక అలంకరణతో పాటు, లైటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు ముఖ్యకూడళ్లలో బతుకమ్మ విశిష్టతను తెలుపు తూ పేపర్ బతుకమ్మలు, భారీ బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -