సూర్యపేటలో మొదలైన బతుకమ్మ సంబరాలు

243
bathukamma
- Advertisement -

సూర్యపేటలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో తీరొక్క పూలతో బతుకమ్మ లు పేరుస్తున్నారు మహిళలు. మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి సునీతా జగదీష్ రెడ్డి,జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,మార్కెట్ కమిటీ ఛైర్మన్ లలితా ఆనంద్,పట్టణమహిళా కొన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సాయంత్రం సూర్యపేట పట్టణంలో బతుకమ్మ ఆటకు సర్వాంగా సుందరంగా సద్దుల చెరువు ముస్తాభైంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి సద్దుల చెరువుపై బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి జగదీష్ రెడ్డి.

- Advertisement -