గోదావరి ఖనిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

421
godavarikhani
- Advertisement -

గోదావరిఖనిలోచౌరస్తాలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌,ఎమ్మెల్యే కోరుకంటి చందర్,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రకాల అలంకరణ లతో బతుకమ్మ లు పేర్చిన మహిళలకు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గోదావరిఖని లో నిర్వహించే ఏ కార్యక్రమం అయిన అందరూ ఉత్సాహం పాల్గొంటారని తెలిపారు. బతుకమ్మ పండుగ విశిష్టత ను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కిందన్నారు. గ్రామాల్లో చెరువుల వద్ద బతుకమ్మ ఘాట్ ల వద్ద సదుపాయాలు ఏర్పాటుచేశామని తెలిపారు.ఆడపడుచులను ప్రోత్సహించడం తెలంగాణ సంస్కృతి….తెలంగాణ వచ్చాకే మహిళలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు.

ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ సంబరంగా జరుపుకోవాలన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్.తెలంగాణలోని అడబిడ్డలందరికి సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీరను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నే పువ్వులను పూజించి సంస్కృతి ఉందన్నారు.

- Advertisement -