క్యాంప్ ఆఫీస్ లో బతుకమ్మ సందడి

213
- Advertisement -

తెలంగాణ పల్లెలన్నీ బతుకమ్మ పూలతో కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. ఉయ్యాల పాటలతో తెలంగాణ పల్లెలు మార్మోగిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో బుధవారం బతుకమ్మ ఆరో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, ఎంపీ కవిత, హరీష్ సతీమణి శ్రీనిత ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. కవిత బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఉత్తేజపరిచారు.

Bathukamma

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఐ అండ్ పీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలను కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రారంభించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

I and PR

మరోవైపు బతుకమ్మకు ప్రపంచ స్ధాయి గుర్తింపు తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ కృషిచేస్తోంది.ఈ నెల ఎనిమిదిన లాల్ బహదూర్ స్టేడియంలో పదివేల మంది మహిళలతో బతుకమ్మ ఉత్సవాలు జరిపి గిన్నిస్ బుక్‌ రికార్డు కోసం అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటి వరకు కేరళ రాష్ట్రానికి చెందిన ఓనం నృత్యం పేరుతో ప్రపంచ రికార్డు నెలకొంది. ఇందులో 5వేల 211 మంది మహిళలు పు తెచ్చేందు ఓనం నృత్యం చేశారు. ఓనం రికార్డును అధిగమించి.. బతుకమ్మకు ప్రపంచ గుర్తింకు ఎనిమిదో తేదీన పదివేల మంది మహిళలతో సామూహిక బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఈ నెల ఐదు, ఆరో తేదీల్లో డివిజన్ల వారీగా మహిళలు, కార్పొరేటర్లకు మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు.

- Advertisement -