ట్యాంక్ బండ్ పై బతుకమ్మ సంబురాలు

276
- Advertisement -

ట్యాంక్ బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పూల పరిమలాలతో హుస్సేన్ సాగర్ గుబాలించింది.విద్యుత్ కాంతులు,బాణసంచా వెలుగులలో సాగరతీరం హోరెత్తిపోయింది.సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మ రూపంలో ప్రజల మధ్య పాట, ఆటల రూపంలో నానింది.. ఆడపిల్లల కష్ట సుఖాలు, ఆనందం, ప్రేమ, ఆప్యాయత, ఉత్సాహం, చరిత్ర, పురాణాలన్నీ కలగలిసి బతుకమ్మ పాటల రూపంలో దర్శనమిచ్చాయి. వేల సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో సాగర తీరం హోరెత్తిపోయింది.

bathukamma

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు ఖండాంతరాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విదేశాల్లోని ప్రవాస తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్తున్నారు. నిన్న డెట్రాయిట్‌లో డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ(డీటీసీ), ఎన్‌ఆర్‌ఐ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ సంబురాలు జరిగాయి. ఈ వేడుకల్లో సుమారు 2 వేల మంది ప్రవాస తెలంగాణవాసులు పాల్గొన్నారు.

bathukamma

కేరళ ఓనం రికార్డును నిన్న బద్దలు కొట్టింది బతుకమ్మ. 9292 మంది మహిళలు గిన్నిస్ బుక్ రికార్డ్ ఈవెంట్ లో మహాబతుకమ్మను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

- Advertisement -