బహ్రెయిన్‌లో బ‌తుక‌మ్మ సందడి

187
- Advertisement -

గ‌ల్ఫ్ దేశం బ‌హ్రెయిన్‌లో ఇవాళ బ‌తుక‌మ్మ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎంపీ క‌విత బ‌తుక‌మ్మ సంబ‌రాల్లో పాల్గొన్నారు. వివిధ దేశాల్లో బ‌తుక‌మ్మ వేడుక‌లు నిర్వ‌హిస్తున్న తెలంగాణ జాగృతి ఇవాళ బ‌హ్రెయిన్‌లో బ‌తుక‌మ్మ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఎంపీ క‌విత బ‌తుకమ్మ‌ను పేర్చి పాట‌లు పాడారు. స్థానికంగా ఉన్న తెలంగాణ ఆడ‌ప‌డుచులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రేపు డెన్మార్క్‌లో జరిగే సంబరాలతో బతుకమ్మ ముగియనుంది.

kavitha

ఇప్పటికే 15 రోజులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఉమ్‌అల్ ఖ్వాయిన్, లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగిన బతుకమ్మ సంబురాల్లో ఆమె హాజరయ్యారు. తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుగా బతుకమ్మను నిలిపేందుకు తెలంగాణ జాగృతి పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

kavtiha

- Advertisement -