ఆర్ధికాభివృద్ధిలో తెలంగాణ టాప్..

198
- Advertisement -

ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఇటీవలె కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిపై ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆర్థికాభివృద్ధి ప్రశంసనీయమని.. చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి సాధ్యమని, దానికి తెలంగాణ రాష్ట్రం ప్రత్యక్ష సాక్ష్యమని వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది వృద్ధి రేటు మొదటి ఆరు నెలల్లో 31.21 శాతంగా నమోదైంది. వృద్ధి రేటులో దక్షిణాది రాష్ర్టాల్లో సైతం తెలంగాణనే అగ్రస్థానంగా నిలిచింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏపీ వృద్ధి రేటు 12.27 శాతం, కర్ణాటక 2.31 శాతం, కేరళలో 3.57 శాతం, తమిళనాడులో -2.63 శాతంగా నమోదైంది.

ఈ ఆర్థిక సంవత్సరం మొదట 6 నెలల్లో రూ. 1935.30 కోట్ల నికర ఆదాయం వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,291.99 కోట్ల టార్గెట్‌లో రూ. 1,935.30 కోట్ల రాబడిని రాష్ట్రం సాధించింది. టార్గెట్‌లో 45 శాతంగా నమోదైంది. గత ఆరు నెలలు చూస్తే.. ఏప్రిల్‌లో 27.92 శాతం, మేలో 44, జూన్‌లో 40.20 శాతం, జులైలో 28.51 శాతం, ఆగస్టులో 31.51 శాతం, సెప్టెంబర్‌లో 31.21 శాతం నికర ఆదాయం వచ్చింది.

జిల్లాల వారీగా(పాత జిల్లాలు) మెదక్‌లో 47.94 శాతం, ఆదిలాబాద్‌లో 38.09 శాతం, హైదరాబాద్‌లో 36.12 శాతం, రంగారెడ్డిలో 33.51 శాతం, మహబూబ్‌నగర్‌లో 32.30 శాతం, వరంగల్‌లో 27.25 శాతం, కరీంనగర్‌లో 22.62 శాతం, నిజామాబాద్‌లో 21.74 శాతం, నల్లగొండలో 6.99 శాతం వృద్ధి రేటు నమోదైంది.

- Advertisement -