ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సం మృగశిర కార్తె సందర్భంగా చేపమందును పంపిణీ చేస్తామని ప్రకటించారు బత్తిని బ్రదర్స్. జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై జూన్ 9న సాయంత్రం ముగుస్తుందని తెలిపింది బత్తిని ఫ్యామిలీ. ఇక చేప మందు పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి లోపం లేకుండా చేప ప్రసాదం పంపిణీ చేపట్టనున్నట్లు బత్తిని ఫ్యామిలీ తెలిపింది.
చేప ప్రసాదం పంపిణీకి ముందు సత్యనారాయణ వ్రతం, భావిపూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం చేప మందు పంపిణీ చేస్తుండటం అనవాయితీగా వస్తోంది. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని ప్రజల నమ్మకం. ఈ చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం వేల సంఖ్యలో వస్తుంటారు.
Also Read:Congress:రేవంత్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?