ఈ మద్య వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాల ధాటికి చాలా ప్రాంతాలు నగరాలు నీటిమాయం అవుతున్నాయి. ఇదిలా ఉంచితే కొంతమందికి వర్షంలో తడవడం ఎంతో ఇష్టంగా భావిస్తుంటారు. ముఖ్యంగా చిరుజల్లులు పడుతున్న టైమ్ లో వర్షంలో తడుస్తూ ఆ అనుభూతిని ఆస్వాదిస్తుంటారు. కానీ పెద్దలేమో వర్షంలో తడవద్దని హెచ్చరిస్తుంటారు. మరి ఇంతకీ వర్షంలో తడిస్తే మంచిదేనా ? ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా ? ఇంతకీ నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం !
సాధారణ నీటికంటే వర్షపు నీరు చాలా స్వచ్చంగా ఉంటుంది. అందుకే వర్షపు నీటి యొక్క పిహెచ్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. వర్షపు నీటిలో ఆమ్లశాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇందులో పిహెచ్ విలువ 6.5 గా ఉంటుంది. అందువల్ల వర్షపు నీటిలో తడవడం గాని, లేదా తాగడం గాని చేస్తే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షపు నీరు స్వచ్చమైనది కావడం వల్ల ఈ నీటిలో తడిస్తే చెమటకాయలు, దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలు నాయమౌతాయట. ఇంకా చెప్పాలంటే వర్షపు నీటిలో క్లోరిన్, ఫ్లోరిన్ వంటి రసాయనాల శాతం ఏ మాత్రం ఉండదు.
Also Read:TTD:పౌర్ణమి గరుడ సేవ
అందువల్ల ఈ నీటిలో తడిస్తే జుట్టుకు ఎంతో మేలట. ఇంకా వర్షంలో తడిస్తే వచ్చే ఆహ్లాదకరమైన అనుభూతి కారణంగా ఎండార్ఫిన్, సెరోటినిన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. తద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దురమౌతాయి. అయితే వర్షపు నీటిలో తడవడం వల్ల కలిగే లాభాలతో పాటు నష్టాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఇందులో పిహెచ్ శాతం ఎక్కువగా ఉండడంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు చాలా త్వరగా ఉత్పన్నమౌతాయి. ఇంకా ముక్కు దిబ్బడ, తల బరువెక్కడం వంటి సమస్యలు కూడా చుట్టూ ముడతాయి. కాబట్టి ఎక్కువసేపు వర్షపు నీటిలో తడవడం కూడా ప్రమాదమే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు