బరువు పెరగాలంటే..!

45
- Advertisement -

నేటి రోజుల్లో లావుగా ఉన్నవాళ్ళు బరువు తగ్గడం ఎంత కష్టమో.. అలాగే సన్నగా ఉన్నవాళ్ళు బరువు పెరగడం కూడా అంతే కష్టం. వయసుకు తగినంత బరువు లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు చుట్టూ మూడతాయి. తక్కువ వెయిట్ ఉన్న వస్తువులను కూడా ఎత్తలేకపోవడం, ప్రతి చిన్న పనికి అలసట చెందడం, నీరసంగా ఉండడం ఇలా చాలా సమస్యలే వేధిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు నలుగురిలో కాన్ఫిడెంట్ గా ఉండలేరు. దాంతో బరువు పెరిగేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.విపరీతంగా ఏది పడితే అది తినడం వంటివి చేస్తుంటారు.. ఇలా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుందే గాని కండ పుష్టి జరగదు. మరికొందరైతే డాక్టర్స్ ను సంప్రధించి మెడిసన్ వాడుతుంటారు. అయితే మనకు సహజ సిద్దంగా దొరిగే కొన్ని పదార్థాల ద్వారా సులభంగా ఎంతో వేగంగా బరువు పెరగవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.

1) సగ్గుబియ్యం
శరీర బరువును పెంచడంలో సగ్గుబియ్యం ఎంతగానో ఉపయోగ పడతాయి. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బరువు వేగంగా పెంచడానికి తోడ్పడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయం పూట ఒక గ్లాసు పాలలో 2-3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకొని తాగాతే త్వరగా బరువు పెరగవచ్చట.

2) ఖర్జూర
ఖర్జూర పండ్లలో కూడా శరీర బరువును పెంచే కారకాలు చాలానే ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, సి, ఇ, కే, బీ2, బీ6, వంటి వాటితో పాటు ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి పాలలో నానబెట్టిన ఖర్జూర పండ్లను ప్రతిరోజూ ఉదయం తినడం వల్ల కండ పుష్టి వేగంగా జరుగుతుంది.

3) వెన్న
బరువును పెంచడంలో పాలపదార్థాల పనితీరే అధికంగా ఉంటుంది. అందులో వెన్న కూడా ఒకటి. ఒక కప్పు వెన్నలో ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీర బరువు వేగంగా పెరిగే అవకాశం ఉంది.

Also Read: గ్రూప్‌ 4లో బలగం..

బరువును పెంచడంలో వేరుశెనగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేరుశనగ ప్రోటీన్లు, మినరల్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అల్పాహారంగా ప్రతిరోజూ సాయంత్రం వేరుశెనగలు ( పచ్చివి ) మరియు తాటిబెల్లం కలిపి తింటే శరీర బరువు వేగంగా పెరుగుతుంది.

ఈ చిట్కాలు పాటిస్తూనే బరువు పెరగడానికి శారీరక శ్రమ చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఒక అరగంట వ్యయమనికి సమయం కేటాయిస్తే వేగంగా మరియు సులభంగా బరువు పెరగవచ్చు.

Also Read:జవాన్, సలార్ కు భారీ డిమాండ్

 

- Advertisement -