బరి.. ఫ‌స్ట్ లుక్

271
bari
- Advertisement -

స‌హాన ఆర్ట్స్ ప‌తాకంపై శ్రీమ‌తి క‌మ‌ల‌మ్మ మ‌రియు వెంకటేశ‌ప్ప స‌మ‌ర్ప‌ణ‌లో రాజు, సహాన జంట‌గా సురేష్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ నిర్మించిన చిత్రం బ‌రి. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అండ్ టీజ‌ర్ లాంచ్ ఈ రోజు ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ…ఫ‌స్ట్ లుక్ , టీజ‌ర్ , టైటిల్ ఎంతో ఆసక్తిక‌రంగా ఉన్నాయి. బ‌రి టైటిల్ చాలా ఫ‌వ‌ర్ఫుల్ గా ఉంది. ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతోన్న హీరోహీరోయిన్స్ కు, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా శుభాకాంక్ష‌లు. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి యూనిట్ అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.

న‌టుడు నాగ‌మ‌హేష్ మాట్లాడుతూ…“ ఈ చిత్రంలో నేను కోడిక‌త్తి శీను పాత్ర‌లో న‌టించాను. ద‌ర్శ‌కుడు మంచి క‌థ‌తో మంచి పాత్ర‌ల‌తో ఈ సినిమాను ఆద్యంతం తెర‌కెక్కించారు. నిర్మాత బెంగుళూరు నుంచి వ‌చ్చి తెలుగు సినిమా మీద ఉన్న ఇష్టంతో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మించారు. హీరో హీరోయిన్స్ ఎంతో అనుభ‌వం ఉన్న‌వారిలా న‌టించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాల‌న్నారు.

హీరో రాజు మాట్లాడుతూ…ఈ సినిమాతో నేను హీరోగా ప‌రిచ‌యం అవుతున్నా. ద‌ర్శ‌కుడు ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి అంద‌రికీ న‌చ్చే విధంగా సినిమా తెర‌కెక్కించారు. మా నిర్మాత టీమ్ ని న‌మ్మి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు అన్నారు.హీరోయిన్ సహాన మాట్లాడుతూ…ఈ చిత్రంలో నేను తుల‌సి అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. హీరోయిన్ గా ఇది నా తొలి చిత్రం. క‌ళ‌ల మీద ఆస‌క్తితో భ‌ర‌త‌నాట్యం కూడా నేర్చుకున్నాను. న‌టిగా ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాను అన్నారు.

నిర్మాత మునికృష్ణ సి.వి. మాట్లాడుతూ…మాది బెంగుళూరు అయినా .. తెలుగులో సినిమాల మీద ఉన్న ఇష్టంతో తొలి సినిమాగా `బ‌రి` చిత్రాన్ని నిర్మించాను. టీమ్ అంతా హార్డ్ వ‌ర్క్ చేశారు. సినిమా అంతా పూర్త‌యింది. ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇంత వ‌ర‌కు రాని క‌థాంశంతో ఈ సినిమా చేశాను. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారని కోరుకుంటున్నా అన్నారు.ద‌ర్శ‌కుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ…గ్రామీణ నేప‌థ్యంలో కోడి పుంజులు, కోడి పందేలు ప్ర‌ధానాశంగా ఇంత‌కు ముందెపుడు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఇలాంటి క‌థాంశంతో సినిమా నిర్మింప‌బ‌డ‌లేదు. మొట్ట‌మొద‌టి సారిగా అచ్చ‌తెలుగు ప‌ల్లెటూరి లోకెష‌న్ల‌లో నిర్మింప‌బ‌డ్డ చిత్రంబ‌రి. రేప‌ల్లె, బాప‌ట్ల‌, తెనాలి ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ప్ర‌తి పాత్ర ఎంతో స‌హ‌జంగా ఉంటుంది. మా నిర్మాత ఫ‌స్ట్ సిట్టింగ్ లోనే క‌థ ఫైన‌ల్ చేసి ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మించారు. ఇందులో 4 పాట‌లున్నాయి. త్వ‌ర‌లో ల‌హ‌రి ఆడియో ద్వారా లిరిక‌ల్ వీడియోస్ లాంచ్ చేస్తాం. ప్ర‌స్తుతం సినిమా సెన్సార్ ద‌శ‌లో ఉంది. ఫిబ్ర‌వ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి సంగీతంః మ‌హ‌వీర్; సినిమాటోగ్ర‌ఫీః వారి అనిల్ కుమార్ రెడ్డి; ఎడిట‌ర్ః శ్రీకృష్ణ అత్త‌లూరి; కొరియోగ్ర‌ఫీః బాల న‌ర‌సింహా; ర‌చ‌న స‌హ‌కారంః నాని, వెంక‌ట్ చల్లగుండ్ల‌; పీఆర్వోః చందు ర‌మేష్‌; నిర్మాత‌లుః మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ‌; క‌థ‌-మాట‌లు-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః సురేష్ రెడ్డి.

- Advertisement -