అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. లీడర్షిప్ సదస్సులో పాల్గొనేందుకు ఒబామా న్యూఢిల్లీ వచ్చారు. మరోసారి బరాక్ ఒబామాను కలవడం సంతోషంగా ఉందని ఇవాళ ప్రధాని ట్వీట్ చేశారు. ఒబామా ఫౌండేషన్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలపై తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉందన్నారు. అమెరికా, భారత్ మధ్య వ్యూహాత్మక బంధాలు మరింత పటిష్టం అవుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకు ముందు హిందుస్థాన్ లీడర్షిప్ సదస్సులో పాల్గొన్న ఒబామా మాట్లాడుతూ… భారత్, అమెరికా దేశాలు కలిసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్యారిస్ ఒప్పందం కోసం నరేంద్ర మోదీ చేసిన కృషి ప్రశంసనీయమైందని తెలిపారు. తమ దేశ నాయకత్వంలో దీనిపై కొంత సందిగ్ధత ఉందని చెప్పారు. ఈ పర్యావరణ ఒప్పందం అద్భుతమైన విజయమని చెప్పారు. ప్రజలు సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించుకునే అవకాశాన్ని ఇచ్చి ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఆయన అన్నారు.
It was a pleasure to meet, once again, former President @BarackObama, and learn about the new initiatives being taken forward under his leadership at the @ObamaFoundation and his perspectives on further strengthening India-US strategic partnership. pic.twitter.com/fvoGgF6CZM
— Narendra Modi (@narendramodi) December 1, 2017